'హరిహర వీరమల్లు': నిధి అగర్వాల్ తప్పుకుందా..క్లారిటీ ఇదే..!

ABN , First Publish Date - 2021-12-05T14:00:52+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో 'హరిహర వీరమల్లు' ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి ఆమె తప్పుకుందనే

'హరిహర వీరమల్లు': నిధి అగర్వాల్ తప్పుకుందా..క్లారిటీ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో 'హరిహర వీరమల్లు' ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి ఆమె తప్పుకుందనే వార్తలు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని అగ్ర నిర్మాత ఏ.ఎం.రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం టాకీపార్ట్ కంప్లీట్ అయిన వీరమల్లు చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ డిసెంబర్ మూడవ వారం నుంచి రాజస్థాన్‌లో మొదలవబోతోందని సమాచారం. అయితే, ఇందులో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ నిధి అగర్వాల్‌ను తప్పించారని ప్రచారం జరుగుతోంది. కానీ, ఇది పూర్తిగా అవాస్తవం అంటున్నారు. ఇవన్నీ కేవలం రూమర్సేనట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రామ్ పాల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.   

Updated Date - 2021-12-05T14:00:52+05:30 IST