Hari Hara Veeramallu : ఆగస్ట్‌లోగా చిత్రీకరణ పూర్తి ?

Twitter IconWatsapp IconFacebook Icon
Hari Hara Veeramallu : ఆగస్ట్‌లోగా చిత్రీకరణ పూర్తి ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), క్రిష్ (Krish) కలయికలో తెరకెక్కుతోన్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం ‘హరి హరవీరమల్లు’ (Harihara Veeramallu). మొఘలాయీల కాలం నాటి కథతో రూపొందుతోన్న ఈ జానపద సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఇప్పటికి రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. దీని కోసం పలు భారీ సెట్స్ నిర్మించారు. అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. దీని వల్ల వేసిన సెట్ మళ్ళీ వేయడం, అందరి కాల్షీట్స్ సర్దుబాటు చేసుకోవడం నిర్మాత ఏయం రత్నం (AM Ratnam) కు తలకు మించిన భారం అవుతోందని ఇండస్ట్రీ టాక్. అందుకే పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఆగస్ట్ నాటికల్లా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని సమాచారం.

ఈ సారి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పుడు.. ఏకథాటిగా చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లా్న్ చేయమని దర్శకుడు క్రిష్ కు చెప్పారట పవన్. ఆగస్ట్ కల్లా తనమీద తీయాల్సిన సన్నివేశాలన్నీ తీసుకోమని, ఆగస్ట్ నుంచి వేరే సినిమాకు కాల్షీట్స్ ఇస్తానని పవన్ అన్నారట. పవన్ చేయబోతున్న ఆ వేరే సినిమా తమిళ సూపర్ హిట్ ‘వినోదయ చిత్తం’ (Vinodaya sittam) రీమేక్. సముద్రఖని (Samudra Khani) దర్శకత్వంలో తంబిరామయ్య (Thambi Ramayya)  కీలక పాత్రలో సముద్రఖని ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సోషియో ఫాంటసీ మూవీ పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చిందట. సాయిధరమ్ తేజ్ (Sai Dharamtej) తో కలిసి పవన్ తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమాను 3 నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశారట. 

2022లోనే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు, వినోదయ చిత్తం’ రీమేక్ వెర్షన్.. పూర్తి చేయాల్సి ఉంటుంది. 2023 సంక్రాంతి కానుకగా ‘హరిహర వీరమల్లు’, సమ్మర్ లో వినోదయ చిత్తం’ రీమేక్ చిత్రాలు విడుదల కాబోతున్నాయని సమాచారం. 2023 జనవరి నుంచి హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ (Bhavadeeyudu Bhagathsingh) చిత్రం షూటింగ్ మొదలు కాబోతోంది. అందుకే ఈ సినిమాలు ప్లాన్ ప్రకారం చిత్రీకరణ జరగాలంటే.. ఆగస్ట్ నాటికల్లా ‘హరిహర వీరమల్లు’ చిత్రం పూర్తి కావాల్సిందే. మరి వచ్చేనెల్లో అయినా ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ తిరిగి సెట్స్ పైకి వెళుతుందేమో చూడాలి. 


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.