ఫన్, యాక్షన్, థ్రిల్...
ABN , First Publish Date - 2022-06-30T06:00:50+05:30 IST
లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. రితేష్ రానా దర్శకత్వంలో చెర్రీ, హేమలత పెదమల్లు నిర్మించారు.

లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. రితేష్ రానా దర్శకత్వంలో చెర్రీ, హేమలత పెదమల్లు నిర్మించారు. జులై 8న ఈ చిత్రం విడుదలవుతోంది. బుధవారం దర్శకుడు రాజమౌళి ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ‘హ్యాపీ బర్త్‌డే’తో మరో మంచి హిట్ అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సినిమాలో డబుల్ ఫన్, డబుల్ యాక్షన్, డబుల్ థ్రిల్ ఉంటుందని రితేష్ రానా అన్నారు. నా క్యారెక్టర్ పూర్తిగా కొత్తదనంతో ఉంటుందని లావణ్య త్రిపాఠీ చెప్పారు. ఒక మంచి థ్రిల్లింగ్ కామెడీతో తెరకెక్కిన చిత్రమిదని చెర్రీ తెలిపారు.