Hanu-Man: విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘ఆదిపురుష్’ కు ఆగచాట్లు.. గ్రాఫిక్స్ ఘనత హైదరాబాద్ కంపెనీదే..

ABN , First Publish Date - 2022-11-30T23:50:25+05:30 IST

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘హను-మాన్’ (Hanu-Man). ఈ చిత్రాన్ని సినిమాటిక్ యూనివర్స్‌గా తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియాగా రూపొందిస్తున్నాడు.

Hanu-Man: విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘ఆదిపురుష్’ కు ఆగచాట్లు.. గ్రాఫిక్స్ ఘనత హైదరాబాద్ కంపెనీదే..

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘హను-మాన్’ (Hanu-Man). ఈ చిత్రాన్ని సినిమాటిక్ యూనివర్స్‌గా తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియాగా రూపొందిస్తున్నాడు. అంజనాద్రి అనే ఊహాలోకాన్ని నేపథ్యంగా చేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మేకర్స్ ఈ మధ్యనే టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను అబ్బురపరిచింది.  


‘హను-మాన్’ టీజర్‌లో విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘ఆదిపురుష్’ తో పోల్చడం మొదలుపెట్టారు. ‘హను-మాన్’ బడ్జెట్ ‘ఆదిపురుష్’ తో పోల్చుకుంటే చాలా తక్కువ. అయినప్పటికి ఈ చిత్రంలోని వీఎఫ్‌‌ఎక్స్ షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. క్వాలిటీ ఎక్కడ తగ్గలేదు. ఈ గ్రాఫిక్స్ వెనుక ఉన్నది హైదరాబాద్‌కు చెందిన స్టూడియోనని సమచారం అందుతుంది. ‘హలో హ్యూస్ స్టూడియోస్’ ఈ విజువల్ ఎఫెక్ట్స్ చేపట్టిందని ఫిలిం నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. నందమూరి కల్యాణ్ రామ్ నుంచి తాజాగా వచ్చిన ‘బింబిసార’ (Bimbisara) గ్రాఫిక్స్‌ని ‘అద్విత క్రియేటివ్ స్టూడియోస్’ చేపట్టింది. ఈ కంపెనీ కూడా హైదరాబాద్‌కు చెందినదే. నందూమూరి కల్యాణ్ రామే ఈ కంపెనీని స్థాపించాడు. ఇవి మాత్రమే కాకుండా భాగ్యనగరంలో మరికొన్ని వీఎఫ్‌‌ఎక్స్ సంస్థలు కూడా ఉన్నాయి. అందువల్ల మేకర్స్ విజువల్ ఎఫెక్ట్స్ అనగానే హాలీవుడ్ స్టూడియోస్ వైపు పరుగు లెత్తకుండా హైదరాబాద్‌లోని కంపెనీలతో  చేయించుకుంటే సినిమాకు ఖర్చు తగ్గుతుంది. నాణ్యత కూడా తగ్గదు. ఇక హను-మాన్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు నటించారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. రిలీజ్ డేట్‌ను త్వరలోనే మేకర్స్ ప్రకటిస్తారు. 

Updated Date - 2022-11-30T23:50:25+05:30 IST