‘హను-మాన్‌’ వస్తున్నాడు

ABN , First Publish Date - 2022-11-08T05:59:57+05:30 IST

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘హను-మాన్‌’. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మాత...

‘హను-మాన్‌’ వస్తున్నాడు

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘హను-మాన్‌’. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మాత. అమృత అయ్యర్‌ కథానాయిక. నవంబరు 15న టీజర్‌ విడుదల చేస్తారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సూపర్‌ హీరోలు మన పురాణాల్లోనూ ఉన్నారు. అలాంటి ఓ హీరో కథ ఇది. తేజకు సరికొత్త ఇమేజ్‌ తీసుకొస్తుంది. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, రాజ్‌ దీపక్‌ పాత్రలు కథకు కీలకం. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు.


Updated Date - 2022-11-08T05:59:57+05:30 IST