మొన్న ‘పుష్ప’.. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’

ABN , First Publish Date - 2022-01-22T01:58:08+05:30 IST

‘పుష్ప’ సినిమాపై ఇప్పటికే ప్రముఖులెందరో ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా భారతీయ క్రికెటర్లతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ‘పుష్ప’కి పడిపోయారు. సినిమాలోని బన్నీ స్టెప్స్, డైలాగ్స్‌తో సోషల్ మీడియాలో

మొన్న ‘పుష్ప’.. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’

‘పుష్ప’ సినిమాపై ఇప్పటికే ప్రముఖులెందరో ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా భారతీయ క్రికెటర్లతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ‘పుష్ప’కి పడిపోయారు. సినిమాలోని బన్నీ స్టెప్స్, డైలాగ్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ లేపారు. ‘పుష్ప’ క్రేజ్ ఇలా ఉంటే న్యాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’పై కూడా ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి దంపతులు.. నానీని ఇంటికి పిలిచి మరీ వారి ఆనందాన్ని తెలియజేశారు. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం చాలా ఆసక్తికరంగా ఉందంటూ క్రికెటర్ హనుమ విహారి ట్వీట్ చేశారు. 


అంతకుముందు ‘పుష్ప’ సినిమాపై కూడా హనుమ విహారి ట్వీట్ చేశారు. ‘‘పుష్పరాజ్ ట్రాన్స్‌లో ఉండిపోయాను. వైవిధ్యమైన నటనను కనబరిచిన అల్లు అర్జున్‌కు, చిత్రయూనిట్‌కు కృతజ్ఞతలు. ‘పుష్ప 2’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను..’’ అని ట్వీట్ చేసిన హనుమ విహారి.. ఇప్పుడు అదే తరహాలో ‘శ్యామ్ సింగరాయ్’పై ట్వీట్ చేశారు. ‘‘శ్యామ్ సింగరాయ్ చిత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. చిత్రయూనిట్ మొత్తానికి అభినందనలు. నాని, సాయిపల్లవి నటన అద్భుతం’’ అంటూ హనుమ విహారి ట్వీట్ చేయగా.. అతనికి హీరో నాని ధన్యవాదాలు తెలిపారు. 



Updated Date - 2022-01-22T01:58:08+05:30 IST