Hansika: హ‌న్సిక సింగిల్ టేక్ మూవీ.. ‘105 మినిట్స్‌’

ABN , First Publish Date - 2021-07-20T20:24:31+05:30 IST

‘దేశముదురు’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులను ప‌ల‌క‌రించిన బ‌బ్లీ బ్యూటీ హ‌న్సిక మొత్వాని.. రీసెంట్‌గా తెలుగులో ‘105 మినిట్స్’ అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మంగ‌ళ‌వారం స్టార్ట్ అయ్యింది.

Hansika: హ‌న్సిక సింగిల్ టేక్ మూవీ.. ‘105 మినిట్స్‌’

‘దేశముదురు’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులను ప‌ల‌క‌రించిన బ‌బ్లీ బ్యూటీ హ‌న్సిక మొత్వాని.. క్రమంగా తెలుగు కంటే తమిళ చిత్రాలకే  ఓటేసింది. అడపా దడపానే తెలుగు సినిమాలు చేస్తోంది. రీసెంట్‌గా 50 సినిమాల‌ను పూర్తి చేసుకున్న హ‌న్సిక చేతిలో మ‌రో రెండు ప్రాజెక్టులున్నాయి. ఇవి కాకుండా 53వ చిత్రంగా తెలుగులో ‘105 మినిట్స్’ అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మంగ‌ళ‌వారం స్టార్ట్ అయ్యింది. ఒకే ఒక క్యారెక్ట‌ర్‌తో వ‌న్ షాట్ రియ‌ల్ టైమ్‌లో.. ఎడిటింగ్ లేకుండా సినిమాను చిత్రీక‌రించ‌నుండ‌టం విశేషం. రాజా దుస్సా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఒకే ఇంట్లో తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సినిమా వ్య‌వ‌ధి కూడా 105 నిమిషాలే కావ‌డం విశేషం. మ‌రి సింగిల్ క్యారెక్ట‌ర్‌, సింగిల్ టేక్ మూవీలో హ‌న్సిక ఎలా మెప్పిస్తుందో చూద్దాం. మరోవైపు హన్సిక 50వ చిత్రం ‘మహ’ తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతుంది. 





Updated Date - 2021-07-20T20:24:31+05:30 IST