‘రౌడీ బేబీ’ ట్యాగ్ తగిలించుకుంటోంది

ABN , First Publish Date - 2021-10-09T01:31:00+05:30 IST

ధనుష్, సాయిపల్లవి కాంబినేషన్‌లోని ‘రౌడీబేబీ’ సాంగ్ ఎటువంటి సంచనాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ‘రౌడీ బేబీ’ ట్యాగ్ కోసం రెడీ అవుతోంది బబ్లీ బ్యూటీ..

‘రౌడీ బేబీ’ ట్యాగ్ తగిలించుకుంటోంది

ధనుష్, సాయిపల్లవి కాంబినేషన్‌లోని ‘రౌడీబేబీ’ సాంగ్ ఎటువంటి సంచనాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ‘రౌడీ బేబీ’ ట్యాగ్ కోసం రెడీ అవుతోంది బబ్లీ బ్యూటీ హన్సిక. ఇటీవలకాలంలో హీరోయిన్‌ హన్సిక మొత్వానీ లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన ‘మహా’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో హీరో శింబు ప్రత్యేక పాత్రలో నటించారు. ఇదిలావుంటే, హన్సిక ప్రధాన పాత్రలో ‘రౌడీ బేబీ’ అనే మూవీ తెరకెక్కనుంది. రాజు శరవణన్‌ దర్శకత్వం వహించే ఈ సినిమాను అభిషేక్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మాత రమేష్‌ పి.పిళ్ళై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు తాజాగా చెన్నై నగరంలో జరిగాయి.


ఈ కార్యక్రమానికి సుప్రసిద్ధ గేయరచయిత వైరముత్తు సహా తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి పాల్గొన్నారు. ఈ చిత్రంలో హాన్సికతో పాటు సీనియర్‌ నటుడు సత్యరాజ్‌, నటి మీనా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.

Updated Date - 2021-10-09T01:31:00+05:30 IST