క్యాన్సర్‌తో పోరాడుతున్న హంసానందిని

ABN , First Publish Date - 2021-12-21T05:57:28+05:30 IST

నటి హంసానందిని క్యాన్సర్‌బారీన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోమవారం సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘‘పద్దెనిమిది సంవత్సరాల క్రితం నా తల్లి క్యాన్సర్‌తోనే మరణించింది....

క్యాన్సర్‌తో పోరాడుతున్న హంసానందిని

నటి హంసానందిని క్యాన్సర్‌బారీన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోమవారం సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘‘పద్దెనిమిది సంవత్సరాల క్రితం నా తల్లి క్యాన్సర్‌తోనే మరణించింది. అప్పటి నుంచీ క్యాన్సర్‌ అనే భయం నన్ను వెంటాడుతూనే ఉంది. నాలుగు నెలల క్రితం రొమ్ము క్యాన్సర్‌ ఉందని బయటపడింది. సర్జరీ చేసి డాక్టర్లు కణతిని తొలగించారు. దాంతో ప్రమాదం తప్పిందని అనుకున్నా. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. జన్యుపరమైన క్యాన్సర్‌ నా శరీరంలో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే శస్త్ర చికిత్సలే శరణ్యం. ఇప్పటికి 9 సార్లు కీమో థెరపీ చేయించుకున్నా. మరో 7సార్లు చేయించుకోవాలి. క్యాన్సర్‌కి నా జీవితం అంకితం చేయాలని లేదు. అందుకే దానితో పోరాడుతున్నా. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తా’’ అని హంసా పేర్కొన్నారు. ‘అనుమానాస్పదం’ చిత్రంతో ఆకట్టుకున్నారు హంసానందిని. ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల్లో ప్రత్యేక గీతాలలో మెరిశారు. కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. హంసాకు క్యాన్సర్‌ సోకిందన్న విషయం అభిమానుల్ని కలచి వేస్తోంది. 


Updated Date - 2021-12-21T05:57:28+05:30 IST