ఆమె మరణం గురించి... ప్రియాంక, కంగనా ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2021-10-25T03:18:50+05:30 IST

ప్రియాంక చోప్రా తన ట్విట్టర్ అకౌంట్లో సినిమాటోగ్రఫర్ హాలీనా హచిన్స్ ఫోటోను షేర్ చేసింది. ఆమె ఓ హాలీవుడ్ మూవీ షూటింగ్‌లో ఈ మధ్యే ప్రమాదవశాత్తూ మరణించింది...

ఆమె మరణం గురించి... ప్రియాంక, కంగనా ఏమన్నారంటే...

ప్రియాంక చోప్రా తన ట్విట్టర్ అకౌంట్లో సినిమాటోగ్రఫర్ హాలీనా హచిన్స్ ఫోటోను షేర్ చేసింది. ఆమె ఓ హాలీవుడ్ మూవీ షూటింగ్‌లో ఈ మధ్యే ప్రమాదవశాత్తూ మరణించింది. నటుడు అలెక్ బాల్డ్‌విన్ చేతిలోని గన్ను అనుకోకుండా పేలటంతో హాలీనా సెట్‌పైనే తుది శ్వాస విడిచింది. అకాల మరణం చెందిన టాలెంటెడ్ సినిమాటోగ్రఫర్‌ని తలుచుకుంటూ ‘‘నేను చలించిపోయాను. ఈ విషాదంతో సంబంధం ఉన్న అక్కడి వారంతా ఇప్పుడు ఎలాంటి బాధకి లోనవుతున్నారో నేను ఊహించలేకపోతున్నాను. అసలు మాటలు రావటం లేదు. ఎవ్వరూ అలా ఫిల్మ్ సెట్‌పైన మరణించకూడదు...’’ అంది ప్రియాంక చోప్రా. 


బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా హాలీవుడ్ లేడీ సినిమాటోగ్రఫర్ మృతి పట్ల సంతాపం తెలిపింది. ‘‘ఇది భయంకరమైన విషయం’’ అంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేసింది. ఆమె తనకు ఎదురైన ‘అత్యంత ప్రమాదకరమైన అనుభవాల్ని’ ప్రస్తావించింది. అలాగే, ‘‘మన భారతీయ చిత్రాల్లో యాక్షన్ ప్రోటోకాల్స్, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్ మరీ ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. సినిమా రంగానికి సంబంధించిన వివిధ సంఘాలు దీనిపై దృష్టి పెట్టాలి...’’ అని కంగనా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది... 

Updated Date - 2021-10-25T03:18:50+05:30 IST