సౌత్ యంగ్ హీరోయిన్స్ రెజీనా కసాండ్ర, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. దీనికి 'శాకినీ- ఢాకినీ' అనే టైటిల్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. జూలై మొదటి వారం నుంచి సెట్స్‌పైకి రాబోతున్న ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలు పెట్టబోతున్నారట. నివేథా - రెజీల మధ్య ఉండే ఓ ఫైట్‌ని ముందు తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందబోతున్న దీనిని కొరియన్ చిత్రం 'మిడ్ నైట్ రన్నర్స్'కి రీమేక్‌గా ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. నివేదా థామస్, రెజీనా తమ పాత్రల కోసం కొరియన్ యాక్షన్ కొరియోగ్రఫర్ల వద్ద శిక్షణ కూడా తీసుకున్నారట. అన్నీ అనుకున్నట్టు పూర్తైతే ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించిన గత చిత్రం 'రణరంగం' నిరశాపరచడంతో ఈ కొత్త చిత్రంతో హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు.