గుమ్మడికాయ కొట్టారు
ABN , First Publish Date - 2021-08-31T06:24:09+05:30 IST
విలువిద్య నేపథ్యంలో నాగశౌర్య కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘లక్ష్య’. నారాయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ నిర్మాతలు...

విలువిద్య నేపథ్యంలో నాగశౌర్య కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘లక్ష్య’. నారాయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ నిర్మాతలు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. దాంతో గుమ్మడికాయ కొట్టేశారు. ‘‘సినిమాలో రెండు లుక్స్‌లో నాగశౌర్య కనిపిస్తారు. రెండిటి మధ్య వైవిధ్యం చూపించడం కోసం ఆయన కష్టపడిన తీరు స్ఫూర్తిదాయకం. కథను అర్థం చేసుకుని విలువిద్యలో శిక్షణ తీసుకున్నారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని నిర్మాతలు చెప్పారు. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది. ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రధారి. ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడు.