డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'గల్లీ రౌడీ'..

ABN , First Publish Date - 2021-10-24T13:10:50+05:30 IST

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన 'గల్లీ రౌడీ' చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. కామెడీ చిత్రాల డైరెక్టర్ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'గల్లీ రౌడీ'..

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన 'గల్లీ రౌడీ' చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. కామెడీ చిత్రాల డైరెక్టర్ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో  నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణమురళి, వైవా హర్ష, రాజేంద్ర ప్రసాద్, స్నేహ గుప్త తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 17న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కోన వెంక‌ట్‌ సమర్పణలో, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమాను ఈ దీపావళి పండుగ సందర్భంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్‌గా రాబోతోంది. 

Updated Date - 2021-10-24T13:10:50+05:30 IST