‘సర్కారు వారి పాట’: ఇప్పట్లో అప్‌డేట్స్ ఉండవా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తీ సురేష్ జంటగా పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏవీ ఇప్పట్లో ఉండవనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమాను చాలా స్టైలిష్‌గా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు. చిన్న షెడ్యూల్ మినహా దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చిది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ‘సర్కారు వారి పాట’ పాట ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ సినిమాల రిలీజ్ కారణంగా ఏప్రిల్ 1కి పోస్ట్‌పోన్ అయింది. అయితే, కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఈ రెండు సినిమాలు మరోమారు అయ్యాయి. ఇదిలా ఉంటే ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను సంక్రాంతి పండుగ నుంచి ఇవ్వనున్నటు ఇంతకముందు మేకర్స్ తెలిపారు. కానీ, మరోసారి ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలున్నాయని ప్రచారం మొదలైంది. అంతేకాదు, ఇప్పుడప్పుడే దీనికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా రావడం అనుమానమే అని టాక్ కూడా వినిపిస్తోది. మరి మేకర్స్ ఈ విషయంలో ఏమంటారో చూడాలి. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.