నా సినిమా హిట్టా, ఫ్లాపా.. అనేది నా ఫోన్ చెప్పేస్తుంది: గోపీచంద్

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో.. క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన భారీ స్పోర్ట్స్ క‌మ‌ర్షియ‌ల్ యాక్షన్ డ్రామా చిత్రం‌ ‘సీటీమార్‌’. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రం వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌ 10న విడుద‌లై ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా చిత్రయూనిట్ మంగ‌ళ‌వారం చిత్ర స‌క్సెస్ మీట్‌ను నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర విడుదల రోజున వినాయ‌కుడి ఆశీస్సుల‌తో సినిమా పెద్ద స‌క్సెస్ సాధిస్తుంద‌ని చెప్పాను. అన్న‌ట్లుగానే సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులను థియేట‌ర్‌కు తీసుకొస్తుంద‌నే గట్టి న‌మ్మ‌కంతో అన్నాను. వినాయ‌క చ‌వితిరోజున సినిమాను విడుద‌ల చేశాం. వినాయ‌కుడు సీటీ కొట్టుకుంటూ వ‌చ్చి థియేట‌ర్స్‌కు ర‌మ్మ‌ని పిలిస్తే ప్రేక్ష‌కులు వ‌చ్చి మాకు చాలా పెద్ద విజ‌యాన్ని అందించారు. ఈ స‌క్సెస్‌లో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌. 


పాండ‌మిక్ టైమ్‌లో షూటింగ్ చేయడ‌మంటే, మ‌న‌సులో తెలియ‌ని ఓ భ‌యం ఉంటుంది. అయినా కూడా ఎంటైర్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డి చేశారు. ఈ సినిమాలో అమ్మాయిల క‌బ‌డ్డీ జ‌ట్టుగా న‌టించిన అమ్మాయిలు ఎన్నో బాధ‌ల‌ను అధిగ‌మించి ఈ స్టేజ్‌కు వ‌చ్చారు. ఈరోజు వాళ్లు స్క్రీన్‌పై క‌నిపించిన‌ప్పుడు క్లాప్స్ కొడుతున్నారంటే కార‌ణం, వాళ్ల త‌ల్లిదండ్రులు ప‌డ్డ క‌ష్ట‌మే. ఈరోజు వాళ్ల కుటుంబ స‌భ్యులు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఫైట్స్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. అందుకు సంప‌త్ డిజైనింగ్ ఓ కార‌ణ‌మైతే, వెంక‌ట్‌, స్టంట్ శివ మాస్ట‌ర్స్ దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు. ప్రేక్ష‌కులు నానుంచి ఎలాంటి ఫైట్స్ ఎక్స్‌పెక్ట్ చేశారో అలాంటి ఫైట్స్ అందించారు. ఇక మ‌ణిశ‌ర్మ‌గారి గురించి చెప్పాలంటే.. ప్రీ రిలీజ్‌లో చెప్పాను. ఆయ‌న‌తో ఏడు సినిమాల‌కు వ‌ర్క్ చేస్తే, ఆరు సూప‌ర్‌హిట్స్ ఉన్నాయని. ఇది మా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఎనిమిదో సినిమా. ఇది కూడా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అద్భుత‌మైన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ‌ణిగారికి థాంక్స్‌. ఆయ‌న‌తో వ‌ర్క్ చేస్తుంటే, మ్యూజిక్ పరంగా ఆయ‌న చూసుకుంటారులే అనే ధైర్యం ఉంటుంది. గౌత‌మ్ నంద త‌ర్వాత సౌంద‌ర్ రాజ‌న్‌తో క‌లిసి చేసిన సినిమా. ఆ సినిమా చూసి నాకు నేనే ఇంత అందంగా ఉన్నానా? అనిపించింది. ఈ సినిమాలో ఇంకా అందంగా న‌న్ను చూపించాడు సౌంద‌ర్‌. ద‌ర్శ‌కుడు సంప‌త్‌కు ఏం కావాలో సౌంద‌ర్ రాజ‌న్‌కు తెలుసు. సంప‌త్‌కు ఏం కావాలో దాని కంటే ఎక్కువ ఔట్‌పుట్టే ఇచ్చాడు. త‌మ‌న్నాతో వ‌ర్క్ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటే.. డేట్స్ అడ్జ‌స్ట్ కాక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో కుద‌ర‌లేదు. ఈ సినిమాలో కుదిరింది. త‌ను బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో అద్భుతంగా న‌టించింది. త‌ను మంచి డాన్స‌ర్‌. రావు ర‌మేశ్‌గారు, పోసానిగారు, త‌రుణ్ అరోరాగారు, భూమిక‌గారు, రెహ‌మాన్‌గారు.. ఇత‌ర కో ఆర్టిస్టులు అంద‌రూ చ‌క్క‌గా న‌టించి స‌పోర్ట్ అందించారు.

డైరెక్ట‌ర్ సంప‌త్‌తో గౌత‌మ్‌నంద చేశాం. ఆ సినిమాను చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని ఎక్స్‌పెక్ట్ చేశాం. కానీ ఎందుకో ఆ సినిమాతో అనుకున్న‌ది రీచ్ కాలేక‌పోయాం. ఈ సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు ముందు ఒక స్టోరి అనుకున్నాం. కానీ వ‌ర్క‌వుట్ కాద‌నుకున్నాం. రెండు నెల‌ల త‌ర్వాత సంప‌త్ ఈ స్టోరితో వ‌చ్చాడు. చాలా మంచి స్టోరి కుదిరింద‌ని అనుకున్నాను. చాలా డిస్క‌స్ చేసుకున్నాం. మ‌ధ్య‌లో పాండ‌మిక్ వ‌చ్చింది. ఈ గ్యాప్‌లో సంప‌త్ స్టోరిని ఇంకా బెట‌ర్‌మెంట్‌గా మార్చాడు. ఈ సినిమా అయితే చాలా క‌ష్ట‌మైపోతుంద‌నే భ‌యం ఇద్ద‌రికీ ఉండేది. కానీ ఏమైనా ఈ సినిమా మిస్ కాకూడ‌ద‌ని అనుకున్నాం. నేను జెన్యూన్‌గా హిట్ అనే మాట విని చాలా కాల‌మైంది. అంత‌కు ముందు హిట్స్ వ‌చ్చాయి. కానీ, ఈ మ‌ధ్య కాలంలో నా సినిమాల‌ను హిట్ అని విన్లేదు. కానీ ఈ సినిమా ఆ కొర‌త తీర్చేసింది. నేను హిట్స్‌, ప్లాప్స్ చూశాను. నా సినిమా హిట్టా, ఫ్లాపా అని నా ఫోన్ చెప్పేస్తుంది. ఇంకొక‌రు చెబితే నేను విన‌ను. హిట్ సౌండ్ ఎలా ఉంటుంది? ఫ్లాప్ సౌండ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నిర్మాత‌లు శ్రీనివాస్ చిట్టూరి, ప‌వ‌న్‌గారు ఈ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. వాళ్ల క‌ష్టానికి ఈరోజు ఇంత పెద్ద హిట్ వ‌చ్చింది. నా నిర్మాత‌ల‌కు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం. ఈ నిర్మాత‌లు ఇంకా మంచి సినిమాలు తీసి పెద్ద ప్రొడ్యూస‌ర్స్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సంప‌త్ కూడా ఈ హిట్‌తో ఆప‌కుండా ఇంకా పెద్ద హిట్ మూవీస్ చేయాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..’’ అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

గోపీచంద్‌ ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ తాజా అప్‌డేట్‌‘సీటీమార్’ మూవీ రివ్యూChiranjeevi: చిరంజీవి కోసం ఆ డైరెక్టర్ టైటిల్ ఇచ్చేశాడా?‘సీటీమార్’ మూవీ రివ్యూ

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.