2022: అత్యధిక మంది సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2022-12-07T23:45:02+05:30 IST
కరోనాతో థియేటర్స్ వెలవెలబోయాయి. ప్రేక్షకులు రెండేళ్ల పాటు సినిమా హాళ్లకు దూరంగా ఉన్నారు. 2022లో అనేక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

కరోనాతో థియేటర్స్ వెలవెలబోయాయి. ప్రేక్షకులు రెండేళ్ల పాటు సినిమా హాళ్లకు దూరంగా ఉన్నారు. 2022లో అనేక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆడియన్స్ కూడా సినిమాలు చూసేందుకు ఆసక్తి కనపరిచారు. కొన్ని చిత్రాల కోసం విపరీతంగా వెతికారు. గూగుల్ ఈ ఏడాది మోస్ట్ సెర్చ్‌డ్ టాప్ 10 మూవీస్ లిస్ట్‌ను విడుదల చేసింది. అత్యధిక మంది నెటిజన్స్ వెతికినా సినిమాలను అభిమానుల ముందుకు తెచ్చింది. సౌతిండియాకు చెందిన అనేక చిత్రాలు ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించుకొన్నాయి. టాప్ 10 లిస్ట్‌లో ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజియఫ్’, ‘కాంతార’ సినిమాలు చోటు సాధించాయి.
1) బ్రహ్మాస్త్ర: పార్ట్ 1 శివ
2) కెజియఫ్: చాప్టర్ 2
3) ది కశ్మీర్ ఫైల్స్
4) ఆర్ఆర్ఆర్
5) కాంతార
6) పుష్ప: ది రైజ్
7) విక్రమ్
8) లాల్ సింగ్ చడ్డా
9) దృశ్యం 2
10) థోర్: లవ్ అండ్ థండర్
‘బ్రహ్మాస్త్ర: పార్ట్ 1 శివ’ లో విజువల్ ఎఫెక్ట్స్ అధికంగా ఉన్నాయి. అందువల్ల ఈ సినిమా కోసం అత్యధిక మంది నెటిజన్స్ వెతికారు. ‘కెజియఫ్ 2’ పై విడుదలకు ముందే భారీ బజ్ ఉంది. ఫస్ట్ చాప్టర్ విజయం సాధించడంతో రెండో భాగం కోసం భారీగా సెర్చ్ చేశారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘కాంతార’ లు అండర్ డాగ్‌గా విడుదలయ్యి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. మూడు, ఐదో స్థానాలను దక్కించుకున్నాయి. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వచ్చిన చిత్రం కావడంతో ‘ఆర్ఆర్ఆర్’ పై ఆసక్తి చూపించారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ 2021 చివరలోనే విడుదలయింది. అయినప్పటికీ ఈ ఏడాది ఆరో స్థానంలో నిలిచింది. కోలీవుడ్ బ్లాక్ బాస్టర్ హిట్ విక్రమ్ ఏడో స్థానం దక్కించుకుంది. మూడు, నాలుగేళ్ల తర్వాత ఆమిర్ ఖాన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘లాల్ సింగ్ చడ్డా’ పై ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. అజయ్ దేవగణ్ ‘దృశ్యం 2’ రీమేక్ అయినప్పటికి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది. తొమ్మది స్థానం సాధించింది. సూపర్ హీరో చిత్రం థోర్: లవ్ అండ్ థండర్ పదో స్థానం దక్కించుకుంది.