రొమాంటిక్‌ సాంగ్‌తో వచ్చిన వరుణ్‌ సందేశ్‌

చాలా గ్యాప్‌ తర్వాత హీరో వరుణ్‌ సందేశ్‌ నటిస్తోన్న చిత్రం ‘ఇందువదన’. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎమ్‌.ఎస్‌.ఆర్‌ దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవ‌లే విడుదలైన ఇందువదన ఫస్ట్ లుక్‌ మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని 'వ‌డి వ‌డిగా' సాంగ్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ సాంగ్‌ మంచి స్పందనను అందుకుంటూ.. సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రొమాంటిక్ మెలోడీగా సాగే ఈ పాట‌లో వ‌రుణ్, ఫ‌ర్నాజ్ మ‌ధ్య కెమిస్ట్రీ బాగుందనే కామెంట్స్‌ కూడా వినవస్తున్నాయి. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా జరుగుతున్నట్లుగా మేకర్స్‌ తెలిపారు. ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని వారు ప్రకటించారు.

‘ఇందువదన’ మూవీ స్టిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.