‘మహాన్‌’: గాంధేయవాది ఎందుకు అలా మారాడు?

ABN , First Publish Date - 2022-02-08T03:36:27+05:30 IST

కోలీవుడ్‌ అగ్రహీరో విక్రమ్‌ తన తనయుడు ధృవ్‌తో కలిసి నటించిన చిత్రం ‘మహాన్‌’. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. సిమ్రాన్‌, బాబీ సింహా, సనంత్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించగా

‘మహాన్‌’: గాంధేయవాది ఎందుకు అలా మారాడు?

కోలీవుడ్‌ అగ్రహీరో విక్రమ్‌ తన తనయుడు ధృవ్‌తో కలిసి నటించిన చిత్రం ‘మహాన్‌’. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. సిమ్రాన్‌, బాబీ సింహా, సనంత్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించగా, 7 స్ర్కీన్‌ పతాకంపై నిర్మాత లలిత్‌ కుమార్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 10న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలవుతుంది. అయితే ఈ ట్రైలర్‌ను పరిశీలిస్తే ఈ చిత్ర కథ మద్య పోరాట నిషేధం చుట్టూ తిరిగే స్టోరీగా కనిపిస్తుంది. మద్య నిషేధ ఉద్యమ వీరుడి తనయుడైన విక్రమ్‌ ఒక గ్రామ ప్రజలకు మద్యాన్ని దొంగచాటుగా సరఫరా చేస్తుంటారు. ఇందులో విక్రమ్‌ గాంధేయ సిద్ధాంతాలు కలిగిన ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటారు. 


వృత్తిరీత్యా టీచర్‌ అయిన విక్రమ్‌ మద్యం ఎందుకు సరఫరా చేస్తాడన్నదే సస్పెన్స్‌గా ఉంది. ఇందులో తండ్రీకొడుకులైన విక్రమ్‌, ధృవ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి, అభిమానులను సందడి చేయనున్నారు. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో విడుదలకానుంది. ఇదిలావుంటే, విక్రమ్‌ ‘కోబ్రా’ చిత్రంలో నటిస్తున్నారు. ‘రావణన్‌’, ‘ఐ’ చిత్రాల తర్వాత ఏఆర్‌.రెహ్మాన్‌ - విక్రమ్‌ కాంబినేషన్‌లో రానున్న మూడో చిత్రం ‘కోబ్రా’. ఇందులో భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రతి నాయకుడి పాత్రను పోషించారు. 



Updated Date - 2022-02-08T03:36:27+05:30 IST