మార్వెల్ అభిమానులకు శుభవార్త.. నాన్‌స్టాప్‌గా 96గంటల పాటు షోస్..

ABN , First Publish Date - 2022-07-01T02:05:29+05:30 IST

మార్వెల్ కామిక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులుంటారు. ఆ కామిక్స్‌ను మార్వెల్ స్టూడియోస్ తెర మీదకు తీసుకువస్తుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి చివరగా వచ్చిన చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవెర్స్ ఆఫ్

మార్వెల్ అభిమానులకు శుభవార్త.. నాన్‌స్టాప్‌గా 96గంటల పాటు షోస్..

మార్వెల్ కామిక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులుంటారు. ఆ కామిక్స్‌ను మార్వెల్ స్టూడియోస్ తెర మీదకు తీసుకువస్తుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి చివరగా వచ్చిన చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవెర్స్ ఆఫ్ మాడ్‌నెస్’(Doctor Strange in the Multiverse of Madness). ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 100కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. మార్వెల్ యూనివర్స్ నుంచి తాజాగా వస్తున్న సినిమా ‘‘థోర్ లవ్ అండ్ థండర్’’ (Thor:Love and Thunder). ఆస్కార్ విజేత తైకా వెయిటిటి (Taika Waititi) దర్శకత్వం వహించారు. క్రిస్ హ్యామ్స్‌వర్త్ (Chris Hemsworth), నటాలీ ఫోర్ట్‌మన్(Natalie Portman) కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జులై 8న విడుదల కానుంది. కానీ, ఇండియాలో ఒక రోజు ముందుగానే జులై 7నే విడుదల చేస్తామని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. తాజాగా మార్వెల్ అభిమానులకు ఆ సంస్థ మరో శుభవార్త  చెప్పింది. 


‘థోర్ లవ్ అండ్ థండర్’ సినిమాను ఇండియాలో నాన్‌స్టాప్‌గా 96గంటల పాటు ప్రదర్శిస్తామని మార్వెల్ స్టూడియోస్ పేర్కొంది. జులై 7న 12:15am నుంచి జులై 10న 11:59pm వరకు షోలు ఉంటాయని ఆ సంస్థ చెప్పింది. ఎంపిక చేసిన థియేటర్స్‌లో ఈ ప్రదర్శనలు కొనసాగుతాయని వెల్లడించింది. ‘థోర్ లవ్ అండ్ థండర్’ ను ఇండియాలో ఆరు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ అనంతరం మూడేళ్ల తర్వాత క్రిస్ ఈ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. క్రిస్ హ్యామ్స్‌వర్త్, తైకా వెయిటిటి కలసి పనిచేయడం ఇది రెండోసారి. గతంలో ‘థోర్: రాగ్నరోక్’ కోసం వీరు చేతులు కలిపారు. 

Updated Date - 2022-07-01T02:05:29+05:30 IST