అమ్మాయిని వరించిన అదృష్టం

ABN , First Publish Date - 2022-01-22T05:47:51+05:30 IST

కీర్తి సురేష్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రధారులు. నగేష్‌ కుమార్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించారు...

అమ్మాయిని వరించిన అదృష్టం

కీర్తి సురేష్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రధారులు. నగేష్‌ కుమార్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించారు. సుధీర్‌ చంద్ర పదిరి నిర్మాత. దిల్‌ రాజు సమర్పిస్తున్నారు. ఈనెల 28న ఈ  చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘స్పోర్ట్స్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్‌ కెరీర్‌లో మరో మేలిమి చిత్రంగా నిలిచిపోతుంది. ఎక్కువ మంది మహిళా టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేశారు. వారందరికీ  ఈ చిత్రం మంచి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది. పాటలు, ప్రచార చిత్రాలూ ఆకట్టుకుంటున్నాయ’’న్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. 


Updated Date - 2022-01-22T05:47:51+05:30 IST