ఫ్యాన్స్ కోసం 'గుడ్ లక్ సఖీ' స్పెషల్ షో..!

సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'గుడ్ లక్ సఖీ'. ఫ్యాన్స్ కోసం ఈ సినిమా స్పెషల్ షో ప్రదర్శించనున్నారట. సోషల్ మీడియా ద్వారా చిత్ర నిర్మాత సుధీర్ చంద్ర పాదిరి ఈ విషయాన్ని తెలిపారు. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో తెరకెక్కి ఇందులో కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నిర్మించిన ఈ సినిమాకి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకులుగా వ్యవహరించారు. జూన్ 3న భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దాంతో కీర్తి సురేశ్ అభిమానులు రిలీజ్ విషయమై నిర్మాతకి ప్రశ్నలు ఎదురయ్యాయట. 

కీర్తి అభిమానుల ఆతృతను అర్థం చేసుకున్న నిర్మాత సుధీర్ చంద్ర యాభై మంది అభిమాను ఎంపిక చేసి ఈ సినిమాను చూపించబోతున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎప్పుడు అభిమనులకు ఈ చిత్రం చూపించబోతున్నారో ఇంకా ప్రకటించనప్పటికి, ప్రస్తుతం యాభై మంది అభిమానుల పేర్ల నమోదు ప్రక్రియ జరుగుతుందట. ఇక 'గుడ్ లక్ సఖీ' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గత ఏడాది కీర్తి సురేష్ నటించిన పెంగ్వి, మిస్ ఇండియా నిరాశపరచాయి. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.