‘గుడ్‌లక్ సఖి’ రిలీజ్ డేట్ వచ్చేసింది

ABN , First Publish Date - 2022-01-21T21:55:45+05:30 IST

‘మహానటి’ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘గుడ్‌లక్ సఖి’. క్రీడా నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఎక్కువ మంది మ‌హిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది.

‘గుడ్‌లక్ సఖి’ రిలీజ్ డేట్ వచ్చేసింది

‘మహానటి’ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘గుడ్‌లక్ సఖి’. క్రీడా నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఎక్కువ మంది మ‌హిళా టెక్నీషియన్స్‌తో ఈ చిత్రం రూపొందింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది.  జనవరి 28న  ‘గుడ్‌లక్ సఖి’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు పోటీగా మరే చిత్రం లేకపోవడంతో మరింతగా ప్రమోట్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రమోషన్స్‌ ను వేగవంతం చేశారు. 


నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన`గుడ్ లక్ సఖి` సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా, చిరంతన్ దాస్ ఛాయగ్రహణం సమకూర్చారు.  ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పోస్టర్లు విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి. మరి ‘గుడ్‌లక్ సఖి’ గా కీర్తి సురేశ్ ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి. 



Updated Date - 2022-01-21T21:55:45+05:30 IST