మా అభిమానులు కూడా ఈ సినిమా చూడాలి - రామ్‌చరణ్‌

ABN , First Publish Date - 2022-01-28T05:00:12+05:30 IST

‘గుడ్‌లక్‌ సఖి’ ప్రీ రిలీజ్‌ వేడుకకు నేను అతిథిగా రాలేదు. నాన్నగారి దూతగా వచ్చాను. ‘మహానటి’లో కీర్తిసురేష్‌ నటన నచ్చింది. జాతీయ అవార్డ్‌ దక్కించుకోవడం గ్రేట్‌.....

మా అభిమానులు కూడా ఈ సినిమా చూడాలి - రామ్‌చరణ్‌

‘గుడ్‌లక్‌ సఖి’ ప్రీ రిలీజ్‌ వేడుకకు నేను అతిథిగా  రాలేదు. నాన్నగారి దూతగా వచ్చాను. ‘మహానటి’లో కీర్తిసురేష్‌ నటన నచ్చింది. జాతీయ అవార్డ్‌ దక్కించుకోవడం గ్రేట్‌. కీర్తి అభిమానులతో పాటు మా అభిమానులు కూడా ఈ సినిమా చూడాలి’ అని రామ్‌చరణ్‌ కోరారు. కీర్తిసురేష్‌ ప్రధాన పాత్రలో నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు థియేటర్లలో విడుదలవుతోంది. బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న రామ్‌చరణ్‌ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.


నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘బ్యాడ్‌లక్‌ సఖి’ నుంచి ‘గుడ్‌లక్‌ సఖి’గా ఈ సినిమా టైటిల్‌ మారింది. కొన్ని ఏరియాలు మేం పంపిణీ చేస్తున్నాం. ఈ సినిమా కీర్తిసురేష్‌కు మరో పెద్ద హిట్‌ అవ్వాలి’ అని కోరుకున్నారు.  ‘25 ఏళ్ల క్రితం ‘హైదరాబాద్‌ బ్లూస్‌’ అనే సినిమా చేశా. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు సినిమా చేయడానికి కారణం కీర్తిసురేష్‌. ఈ సినిమాలో తన పాత్రను ఆమె చక్కగా  పోషించారు’ అని చెప్పారు. ఈ సినిమా కోసం టీమ్‌ చాలా కష్టపడిందని చిత్ర నిర్మాత సుధీర్‌ చంద్ర పదిరి అన్నారు.

Updated Date - 2022-01-28T05:00:12+05:30 IST