మంచి రోజులు త్వరలోనే వస్తాయి

ABN , First Publish Date - 2021-07-26T09:27:58+05:30 IST

‘‘కరోనా వల్ల తలెత్తిన ఇబ్బందులను చూసినప్పుడు నా వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం...

మంచి రోజులు త్వరలోనే వస్తాయి

‘‘కరోనా వల్ల తలెత్తిన ఇబ్బందులను చూసినప్పుడు నా వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం. మెరుపు వేగంతో చిత్రీకరణ ముగించి థియేటర్లలో విడుదల చేస్తున్నాం’’ అని దర్శకుడు మారుతి తెలిపారు. ఆయన దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి క్యారెక్టర్‌ లుక్‌ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ ‘‘మా సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తాం. ప్రేక్షకులు అందరూ ఎలాంటి భయాలు లేకుండా థియేటర్లకు వచ్చి సినిమా చూసే మంచి రోజులు త్వరలోనే వస్తాయని భావిస్తున్నాను’’ అని అన్నారు. మెహరీన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాను ఒప్పుకోవడంతోనే నాకు మంచి రోజులు వచ్చాయి. కరోనా వల్ల మనలో చాలామంది లోలోపల అనుభవిస్తున్న బాధకు ఈ చిత్రం మెడిసిన్‌లా పనిచేస్తుంది’’ అని చెప్పారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.వి. సెల్యులాయిడ్‌తో కలసి ఎస్‌కేఎన్‌ నిర్మిస్తున్నారు. 


Updated Date - 2021-07-26T09:27:58+05:30 IST