గాడ్ ఫాదర్ సిద్ధమయ్యాడు!
ABN , First Publish Date - 2022-09-24T05:58:45+05:30 IST
చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. సల్మాన్ ఖాన్ కీలక పాత్రధారి. నయనతార కథానాయిక...

చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. సల్మాన్ ఖాన్ కీలక పాత్రధారి. నయనతార కథానాయిక. మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలు. అక్టోబరు 5న విడుదల కానుంది. శుక్రవారం ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘‘మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసీఫర్’కి ఇది రీమేక్. చిరంజీవి శైలికి, ఆయన ఇమేజ్‌కీ తగినట్టు మార్పులు చేశాం. సల్మాన్ ఖాన్‌తో చిరు ‘తార్ మార్’ పాటకు వేసిన స్టెప్పులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తాం. మిగిలిన పాటల్ని కూడా విడుదల చేస్తామ’’ని నిర్మాతలు తెలిపారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సత్యదేవ్, సునీల్, సముద్రఖని తదితరులు నటించారు. సమర్పణ: కొణిదెల సురేఖ.