God father: గజగజ వణికించే గజరాజు అడుగోరా!

ABN , First Publish Date - 2022-09-28T00:49:57+05:30 IST

చిరంజీవి (Mega Star Chiranjeevi)హీరోగా మోహన్‌ రాజా (Mohan raja)దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’(God father). దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల కానుందీ సినిమా.

God father: గజగజ వణికించే గజరాజు అడుగోరా!

చిరంజీవి (Mega Star Chiranjeevi)హీరోగా మోహన్‌ రాజా (Mohan raja)దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’(God father). దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల కానుందీ సినిమా. మంగళవారం ఈ చిత్రం రెండో పాటను విడుదల చేశారు. ‘నజభజ జజరా.. గజగజ వణికించే గజరాజు అడుగోరా.. ‘నజభజ జజరా.. భుజములు ఝుళిపించే మొనగాడిడిగోరా’ అనే పాట  హీరో వ్యక్తిత్వాన్ని తెలియజేసేలా ఉంది. ‘అడవి తల్లికి అన్నయ్య వీడురా.. కనబడితే కథకళిరా, ‘ఘీమ్‌ ఘీమ్‌ ఘీంకరించిన ఐరావతం’, ‘గిర్రుగిర్రున తొండము తిప్పితె చిత్తడై పోతావ్‌’ అంటూ సాగే చరణాలు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఈ పాట యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కించినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర ఆలపించారు. తమన్‌ స్వరకర్త. మలయాళ సూపర్‌హిట్‌ చిత్రం ‘లూసీఫర్‌’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరి జగన్నాథ్‌ కీలక పాత్రధారులు. ఈ నెల 28వ అనంతపురంలో ప్రీ రిలీజ్‌ వేడుక జరగనుంది. పాట విజువల్స్‌ చూస్తుంటే తెరపై ప్రేక్షకులను, అభిమానులు విపరీతంగా అలరించేలా ఉంది. 




Updated Date - 2022-09-28T00:49:57+05:30 IST