దేవుడు కూడా అవతారాలు ఎత్తాల్సిందే

ABN , First Publish Date - 2022-01-29T10:53:32+05:30 IST

‘‘రాక్షసుడ్ని సంహరించడానికి దేవుడు కూడా అవతారాలు ఎత్తాల్సిందే... నేను మామూలు మనిషిని..’’ అంటూ ఓ సామాన్యుడు యుద్ధానికి దిగితే...

దేవుడు కూడా అవతారాలు ఎత్తాల్సిందే

‘‘రాక్షసుడ్ని సంహరించడానికి దేవుడు కూడా అవతారాలు ఎత్తాల్సిందే... నేను మామూలు మనిషిని..’’ అంటూ ఓ సామాన్యుడు యుద్ధానికి దిగితే ఎలా ఉంటుందో చూపించబోతున్నారు శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘భళా తందనాన’. కేథరిన్‌ కథానాయిక. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రజనీ కొర్రపాటి నిర్మాత. శుక్రవారం యువ కథానాయకుడు నాని చేతులమీదుగా టీజర్‌ ఆవిష్కరించారు. టీజర్‌లో విష్ణు పలికిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఓ సామాన్యుడు వ్యవస్థపై తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో ఈ కథలో చెప్పినట్టు.. టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి శ్రీకాంత్‌ విస్సా సంభాషణలు అందించారు.  చిత్రీకరణ పూర్తయింది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. 


Updated Date - 2022-01-29T10:53:32+05:30 IST