పదిహేనేళ్ల తర్వాత థియేటర్‌కు వెళ్లా

ABN , First Publish Date - 2022-01-18T05:38:24+05:30 IST

‘నేను పదిహేనేళ్లుగా థియేటర్‌కు వెళ్లలేదు. కానీ ‘హీరో’ కోసం వెళ్లి చూశాను. పెద్దగా నవ్వని నేను ఈ సినిమా చూసి ఎంజాయ్‌ చేశా....

పదిహేనేళ్ల తర్వాత థియేటర్‌కు వెళ్లా

‘నేను పదిహేనేళ్లుగా థియేటర్‌కు వెళ్లలేదు. కానీ ‘హీరో’  కోసం వెళ్లి చూశాను. పెద్దగా నవ్వని నేను ఈ సినిమా చూసి ఎంజాయ్‌ చేశా. పెద్ద సినిమాలు చేస్తున్న నాకు  కొత్త హీరో, దర్శకుడితో చేయాలనిపించలేదు. అందుకే చేయనని చెప్పేశా. కానీ పద్మగారు మా సోదరికి ఒకటికి పదిసార్లు ఈ పాత్ర నేను చేస్తేనే బాగుంటుందని చెప్పి ఒప్పించారు. దర్శకుడు నా అంచనాలు తారుమారు చేసి ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా చిత్రాన్ని  రూపొందించారు’ అన్నారు జగపతిబాబు. ఆదివారం సాయంత్రం జరిగిన ‘హీరో’ చిత్రం ధ్యాంక్స్‌ మీట్‌లో ఆయన  మాట్లాడారు. చిత్ర హీరో అశోక్‌ గల్లా  మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసి ఎంజాయ్‌ చేస్తున్న ఆడియన్స్‌కు థ్యాంక్స్‌ చెబుతున్నా. నా ఇష్టాన్ని గ్రహించిన అమ్మానాన్నలకు కృతజ్ఞతలు’ అన్నారు. నిర్మాత గల్లా  పద్మావతి మాట్లాడుతూ ‘యూత్‌, ఫ్యామిలీ అందరూ కలసి చూసే సినిమా ఇది. కామెడీ సినిమాకు హైలైట్‌ అయింది. పబ్లిసిటీకి సమయం లేకుండా విడుదల చేయాల్సి వచ్చింది. అయినా ప్రేక్షకుల ఆదరణ బాగుంది’ అన్నారు. సమష్టి కృషి వల్ల ఈ సినిమా విజయం సాధించిందని జయదేవ్‌ గల్లా అన్నారు. ‘నేను నాలుగు సినిమాలు చేసినా ఈ సినిమాకు వచ్చిన స్పందన ఏ చిత్రానికీ రాలేదు. ప్రేక్షకుల్ని నవ్వించాలనే ఈ సినిమా తీశాం. థియేటర్లలో నిజమైన పండగలా ఉంది’ అన్నారు  దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య.

Updated Date - 2022-01-18T05:38:24+05:30 IST