GHANI: తమన్నా సాంగ్ వచ్చేసింది..

'గని' సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్రబృదం 'కొడ్తే' అంటూ సాగే మాస్ నంబర్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా వదిలారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబి, సిద్దు ముద్ద కలిసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఇందులో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మ్యూజిక్ సెన్షేషన్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.