ఓటీటీలో ‘గని’ ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2022-04-17T19:50:32+05:30 IST

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా.. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘గని’. బాక్సర్ కావాలని కలలు కనే ఒక యువకుడు కుటుంబం, ప్రత్యు్ర్ధుల నుంచి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు. తల్లికిచ్చిన మాట కోసం అతడు బాక్సింగ్ కు దూరమయ్యాడా? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈనెల 8న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అలరించ లేకపోయింది. సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించగా, జగపతి బాబు, ఉపేంద్ర, నరేశ్, నదియా, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా విడుదలైన ఇప్పటికి తొమ్మిదిరోజులయింది. ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తోంది. ఈ నెల 22న ‘గని’ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. మరి ఈ సినిమా ఓటీటీలో అయినా మంచి ఆదరణను దక్కించుకుంటుందేమో చూడాలి. 

Updated Date - 2022-04-17T19:50:32+05:30 IST