నేను Shah Rukh Khan మతాన్ని గౌరవిస్తాను.. దాని అర్థం నేను మతం మారినట్టు కాదు.. ఓ ఇంటర్వ్యూలో Gauri Khan ఇంకేం చెప్పారంటే..

ABN , First Publish Date - 2021-10-26T18:25:19+05:30 IST

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అనూహ్యంగా మతం అంశం తెర పైకి వచ్చింది. ఈ కేసును డీల్ చేస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్

నేను Shah Rukh Khan మతాన్ని గౌరవిస్తాను.. దాని అర్థం నేను మతం మారినట్టు కాదు.. ఓ ఇంటర్వ్యూలో Gauri Khan ఇంకేం చెప్పారంటే..

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అనూహ్యంగా మతం అంశం తెర పైకి వచ్చింది. ఈ కేసును డీల్ చేస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మతం గురించి మహారాష్ట్ర మంతి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. వాటికి సమీర్, ఆయన భార్య క్రాంతి సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న షారూక్, గౌరి మతాంతర వివాహం గురించి చర్చ జరుగుతోంది. 1991లోనే వీరిద్దరూ మతాంతర వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గౌరి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళ కాగా, షారూక్ ముస్లిం పఠాన్ కుటుంబానికి చెందిన వ్యక్తి. 


ఈ నేపథ్యంలో గౌరి పేరెంట్స్‌ను పెళ్లికి ఒప్పించడానికి షారూక్ ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరకు 1991 అక్టోబర్ 25న వీరి వివాహం హిందూ సాంప్రదాయంలో జరిగింది. గతంలో `కాఫీ విత్ కరణ్` కార్యక్రమానికి హాజరైన గౌరి.. విభన్న మతాలకు చెందిన తాము ఎలా కలిసి ఉంటున్నామో చెప్పింది. `దివాళి, హోళీ లేదా ఏ హిందూ పండగ వచ్చినా నేను ఛార్జ్ తీసుకుంటాను. అప్పుడు పిల్లలు నాతో కలిసి పూజలు చేస్తారు. తల్లిగా నేను హిందూ పూజలు చేస్తుండడంతో పిల్లలపై ఆ ప్రభావమే ఎక్కువగా ఉంటుంద`ని చెప్పింది. 


మతం మారాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. `మా మధ్య సమతూకం ఉంటుంది. నేను షారూక్ మతాన్ని గౌరవిస్తాను. అంత మాత్రాన నేను మాతం మారిపోయినట్టు కాదు. వ్యక్తులుగా ఎవరి నమ్మకం వారిది. ఎవరికి నచ్చిన మతాన్ని వారు అనుసరించవచ్చు. షారూక్ నా మతాన్ని గౌరవిస్తాడు. నేను అతడి మతాన్ని గౌరవిస్తాన`ని గౌరి చెప్పింది.   

Updated Date - 2021-10-26T18:25:19+05:30 IST