‘లైగర్’ భామకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో భార్య.. థ్యాంక్యూ ఆంటీ అంటూ..

బాలీవుడ్‌లో మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సాధించిన బ్యూటీ అనన్య పాండే. ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న ‘లైగర్’లో నటిస్తోంది.


పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో తెలుగుతో పాటు సౌతిండియాలోని అన్ని ఇండస్ట్రీలకి ఒకేసారి పరిచయం అవుతోంది. తాజాగా అనన్యకి బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఓ గిఫ్ట్ ఇచ్చింది. ప్రత్యేకంగా తయారు చేయించిన ఆర్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనన్య. 


ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఆ స్టోరీకి ‘ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ గౌరీ ఆంటీ’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే అనన్య, షారుక్ ఖాన్ ఆప్త మిత్రుడు చుంకీ పాండే కూతురు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ కూతురు సుహనా ఖాన్, కొడుకు ఆర్యన్ ఖాన్‌కి మంచి స్నేహితురాలు కూడా. దీంతో గౌరీ తన పిల్లల ఫ్రెండ్‌కి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చింది.

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.