Garuda vega Anji: ఆ లైన్‌ ఇన్‌స్పైర్‌ చేయడంతో దర్శకుడినయ్యా

ABN , First Publish Date - 2022-06-28T21:51:25+05:30 IST

శ్రీరామ్‌(Sri ram), అవికా గోర్‌ (Avikagor) ప్రధాన పాత్రధారులుగా ‘గరుడవేగ అంజి’ దర్శకత్వం వహించిన చిత్రం ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ (Tenth class memories). అచ్యుత రామారావు.పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్‌ మైసూర్‌ సమర్పకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం ఈ సందర్భంగా దర్శకుడు పంచుకున్న ఆసక్తికర విశేషాలు...

Garuda vega Anji: ఆ లైన్‌ ఇన్‌స్పైర్‌ చేయడంతో దర్శకుడినయ్యా

శ్రీరామ్‌(Sri ram), అవికా గోర్‌ (Avika gor) ప్రధాన పాత్రధారులుగా ‘గరుడవేగ అంజి’ దర్శకత్వం వహించిన చిత్రం ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ (Tenth class memories). అచ్యుత రామారావు.పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్‌ మైసూర్‌ సమర్పకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం ఈ సందర్భంగా దర్శకుడు పంచుకున్న ఆసక్తికర విశేషాలు...


మొదటి నుంచి నాకు దర్శకత్వం వహించాలనే ఆలోచన లేదు. ఈ నిర్మాణ సంస్థతో నాకు మధ్య మంచి అనుబంధం ఉంది. అచ్యుత రామారావు గారు, ఆయన స్నేహితుల జీవితంలో జరిగిన కథను సినిమాటిక్‌గా చెబుతున్నాం. ఆయన అప్పుడప్పుడూ మా జీవితంలో ఇలా జరిగిందని చెబుతుండేవారు. ‘మా స్నేహితుల్లో ఒక అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కోసం వెయిట్‌ చేస్తూ ఉండిపోయిందని’ చెప్పారు. ఆ పాయింట్‌ నన్ను ఇన్‌స్పైర్‌ చేయడంతో డైరెక్షన్‌ వైపు వచ్చాను. పూర్తిగా ఎమోషనల్‌గా సాగే చిత్రమిది. యాక్షన్‌, వయలెన్స్‌ పెద్దగా ఉండవు. ఎమోషన్‌, యాక్షన్‌, డ్రామా అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. నా టెన్త్‌ క్లాస్‌ జ్ఞాపకాలేమీ ఈ చిత్రంలో పెట్టలేదు. కానీ షూటింగ్‌ టైమ్‌లో అప్పటి సరదా రోజులు గుర్తొచ్చాయి. (Garuda vega Anji interview)


ఛాయగ్రాహకుడిగా నా 50వ చిత్రమిది. దీనికి ముందు 49 చిత్రాల్లో 40 మంది దర్శకులతో పని చేశా. వాళ్ళ కథను నా విజువల్స్‌తో చూపించిన ఎక్స్‌పీరియన్స్‌ ఉండటంతో ఈ కథకు న్యాయం చేయగలనని నాకు, మా నిర్మాతలకు అనిపించింది. కథను అడాప్ట్‌ చేసుకుని కొంత వర్క్‌ చేశా. ఆ తర్వాత దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ నేనే చేేస్త బావుంటుందని అనిపించింది. దాసరి నారాయణరావు, రామ్‌ గోపాల్‌ వర్మ వంటి దర్శకుల వాళ్ళ దగ్గర నేర్చుకున్నది నాకు ఈ సినిమాకు ఉపయోగపడింది. 


వినోదంతో పాటు భావోద్వేగాలు పండించే కథ ఇది. ఇలాంటి కథకు మంచి పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చే హీరో కావాలి. నాకు బాగా పరిచయం ఉన్న శ్రీరామ్‌ ఈకథకు సరిపోతారనిపించి ఆయన్ను ఎంపిక చేశాం. హీరోయిన్‌ పాత్రను చూడగానే మన ఇంట్లో అమ్మాయిలా అనిపించాలి. అవికా గోర్‌ ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌ ద్వారా తెలుగువారందరికీ పరిచయమున్న అమ్మాయి. ఈ కథకు ఫస్ట్‌ ఛాయిస్‌ కూడా తనే. 


‘బుజ్జి ఇలా రా’ నేను దర్శకత్వం వహించిన రెండో సినిమా. జి. నాగేశ్వరరెడ్డి కథ, స్ర్కీన్‌ ప్లే అందించడంతో పాటు ప్రొడక్షన్‌ చేశారు. త్వరలో విడుదల చేస్తాం. నన్ను ఇన్‌స్పైర్‌ చేసే కథ ఉంటే డైరెక్షన్‌ చేస్తా. ప్రస్తుతం ఓ రీమేక్‌ అనుకుంటున్నా. అన్ని కుదిరితే అది చేస్తా. లేదంటే సినిమాటోగ్రాఫర్‌గా కొనసాగుతా. ఇటీవల ఓ మలయాళ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేయడానికి సైన్‌ చేశా. 

Updated Date - 2022-06-28T21:51:25+05:30 IST