‘గంగూబాయ్ కతియావాడి’ షూటింగ్ పూర్తి

అలియా భట్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గంగూబాయ్ కతియావాడి’. దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణుగుతున్న క్ర‌మంలో షూటింగుల‌కు ప‌రిమితులు ల‌భించ‌డంతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇప్పుడు సినిమా షూటింగ్ అంతా పూర్త‌య్యింది. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీతో క‌లిసి జయంతి లాల్ గ‌డా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 30న తెలుగు, హిందీ భాష‌ల్లో మూవీ విడుద‌ల కానుంది. ఈ సినిమా ట్రైల‌ర్ కూడా విడుద‌లై మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. 

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.