గణేష్ బెల్లంకొండ ‘స్వాతిముత్యం’ గ్లిమ్స్ విడుదల

నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు గణేష్ బెల్లంకొండ హీరోగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంతో లక్ష్మణ్.కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర గ్లిమ్స్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. 


సరదాగా సాగిన ఈ గ్లిమ్స్‌లో..

‘‘రావు రమేష్ ఎవరితోనో .. ఏరా అమ్మాయిని కలిశావా..? పంతులు గారితో ఇప్పుడే మాట్లాడాను.. అమ్మాయి వాళ్ళ నాన్నకి పట్టింపులు ఎక్కువ పద్దతి అది ఇది అని బుర్ర తినేస్తాడంటాడేంటి అనే మాటలతో ప్రారంభమైన ఈ గ్లిమ్స్.. ఆ తరువాత హీరోయిన్ తన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొంటూ సెల్ఫీ దిగే సన్నివేశాలు.. అనంతరం హీరోయిన్ హీరోతో నువ్వు వర్జిన్‌వా అని అడగటం దానికి అది...అంటూ హీరో నీళ్ళు నమలటం.. మరో దృశ్యంలో.. ఇప్పుడు ఏంటి కాళ్ళు కడగాలి అంతే కదా..! అని హీరో చేసే పని చూసి.. ఎదవ.. ఎదవ సన్నాసి నువ్వు కాదు.. ఆళ్లు నీ కాళ్ళు కడగాలి.. నా పరువు తీసేస్తున్నాడు ఈడు అంటూ రావు రమేష్ విసుక్కోవడం, ఎవరి కాళ్ళు ఎవరు కడిగితే ఏంటి నాన్న అంటూ హీరో అనటం.. ఇలా సరదాగా నడిచిందీ వీడియో. వినోదమే ప్రధానంగా ఈ చిత్రం ఆద్యంతం రూపొందుతోందని ఇందులోని దృశ్యాలు చూస్తుంటే తెలుస్తోంది. 


ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘స్వాతిముత్యం’ వంటి ఓ యువకుడి కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తుంది... అని తెలుపగా.. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుందని, మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.