‘సామాన్యుడు’ తో పోటీ పడనున్న ‘హీరో’

టాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ అన్నీ వచ్చే సంక్రాంతి సీజన్ కు లాక్ అయిపోయాయి. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’, పవన్ ‘భీమ్లానాయక్’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రాలు  వరుసగా బాక్సాఫీస్ ను హీటెక్కించబోతున్నాయి. అయినా సరే ఈ గ్యాప్ లో నాగార్జున ‘బంగార్రాజు’ మూవీకి స్లాట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే రిపబ్లిక్ డే కి టాలీవుడ్ నుంచి ఒకే ఒక్క సినిమా విడుదల కాబోతోంది. మహేశ్ మేనల్లుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీ ‘హీరో’. ‘భలే మంచిరోజు, దేవదాస్, శమంతకమణి’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకి దర్శకుడు. మహేశ్ బాబు సోదరి పద్మావతి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తన మేనమామ మహేశ్ ఫేస్ కట్స్ తో ఆకట్టుకుంటున్న అశోక్ .. తన తొలి చిత్రంతోనే యాక్షన్ హీరోగా ఎలివేట్ కానుండడం విశేషం. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. 


అయితే ఈ సినిమాకి అదే రోజున  కోలీవుడ్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. విశాల్ డబ్బింగ్ సినిమా ‘సామాన్యుడు’ చిత్రాన్ని ఆ డేట్లోనే విడుదల చేయబోతున్నారు. ‘వీరమే వాగై సూడుమ్’ గా తమిళంలో విడుదలవుతోన్న ఈసినిమాకి శరవణన్ దర్శకుడు. డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. టాలీవుడ్ లో హీరోగా లాంఛ్ అవ్వాలనుకుంటున్న గల్లా అశోక్ కి విశాల్ ‘సామాన్యుడు’ ఎంత గట్టి పోటీ ఇస్తాడో చూడాలి.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.