ఫుల్‌ కిక్కు

ABN , First Publish Date - 2022-01-27T05:42:51+05:30 IST

బుధవారం రవితేజ పుట్టిన రోజు. ఆయన నటిస్తున్న సినిమాల స్పెషల్‌ అప్‌డేట్స్‌తో చిత్రయూనిట్‌లు అభిమానులకు బుధవారం ఫుల్‌ కిక్కు ఇచ్చాయి...

ఫుల్‌ కిక్కు

బుధవారం రవితేజ పుట్టిన రోజు. ఆయన నటిస్తున్న సినిమాల స్పెషల్‌ అప్‌డేట్స్‌తో చిత్రయూనిట్‌లు అభిమానులకు  బుధవారం ఫుల్‌ కిక్కు ఇచ్చాయి. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించనున్న ‘ధమాకా’ చిత్రం నుంచి స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ట్రెండీవేర్‌లో ఫుల్‌ ఎనర్జీతో రవితేజ ఆకట్టుకున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. 


శరత్‌ మండవ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. రవితేజ బర్త్‌డే పోస్టర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. సినిమాలోని విభిన్న ఘట్టాల్లో రవితేజ భావోద్వేగాలను ప్రతిఫలిస్తూ రూపొందించిన పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ హీరోయిన్లు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 25న రిలీజ్‌ కానుంది. బుధవారం ఓ పాట చిత్రీకరణ ప్రారంభమైంది. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు.


రవితేజ, దర్శకుడు రమేష్‌వర్మ కలయికలో రూపొందిన చిత్రం ‘ఖిలాడి’. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ‘ఫుల్‌ కిక్కు’ అంటూ సాగే మాస్‌ గీతం లిరికల్‌ వీడియోను బుధవారం రిలీజ్‌ చేశారు. శ్రీమణి సాహిత్యానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా, సాగర్‌, మమతా శర్మ ఆలపించారు. మీనాక్షి చౌధరి, డింపుల్‌ హయతి కథానాయికలు. కోనేరు సత్యనారాయణ నిర్మాత.


Updated Date - 2022-01-27T05:42:51+05:30 IST