కరోనా కాలంలో కథనాయిక రహస్య కళ్యాణం! ఇప్పుడు ఫోటోలు OUT...
ABN , First Publish Date - 2021-10-23T01:29:08+05:30 IST
‘‘నా భర్త, నేను మా బంధాన్ని అధికారికం చేయాలనుకున్నాం. అందుకు తగిన సమయం ఆసన్నమైందని భావించాం’’ అని అర్థం వచ్చేలా తన సొషల్ మీడియా అకౌంట్లో పోస్ట రాసింది హాట్ బ్యూటీ...

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ ఫ్రిడా పింటో తన సీక్రెట్ మ్యారేజ్ ఫోటోలు ఇప్పుడు బయట పెట్టింది. ఆమె సంవత్సరం క్రింద ప్రియుడు కారీ ట్రాన్‌ను వివాహమాడింది. అప్పుడు కరోనా వేవ్ తీవ్రంగా ఉండటంతో తన పెళ్లి విషయం ఎవ్వరికీ చెప్పలేదు. లాక్‌డౌన్‌లో వెడ్‌లాక్‌లోకి ఎంటరైన హాలీవుడ్ బ్యూటీ లెటెస్ట్‌గా ఆనాటి రొమాంటిక్ పిక్స్ బయట పెట్టింది.
‘‘నా భర్త, నేను మా బంధాన్ని అధికారికం చేయాలనుకున్నాం. అందుకు తగిన సమయం ఆసన్నమైందని భావించాం’’ అని అర్థం వచ్చేలా తన సొషల్ మీడియా అకౌంట్లో ఓ పోస్ట్ రాసింది ఫ్రిడా పింటో. ఆమె గత జూన్‌లోనే తాను ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించి సంచలనం సృష్టించింది. అప్పుడే ఆమె బాయ్‌ఫ్రెండ్ ట్రాన్ గురించి చాలా మందికి తెలిసింది. తానొక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్...