‘మా’ సభ్యులకు ఫ్రీ మెడికల్‌ క్యాంప్‌: మంచు విష్ణు

ABN , First Publish Date - 2021-11-28T01:27:00+05:30 IST

‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తన కార్యాచరణ మొదలు పెట్టారు. తన మ్యానిఫెస్టోలో ముఖ్యంగా పేర్కొన్న సభ్యుల ఆరోగ్యంపై ఆయన దృష్టిపెట్టారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నారు. ‘మా’ సభ్యుల కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫ్రీ మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

‘మా’ సభ్యులకు ఫ్రీ మెడికల్‌ క్యాంప్‌: మంచు విష్ణు

‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తన కార్యాచరణ మొదలు పెట్టారు. తన మ్యానిఫెస్టోలో ముఖ్యంగా పేర్కొన్న సభ్యుల ఆరోగ్యంపై ఆయన దృష్టిపెట్టారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నారు. ‘మా’ సభ్యుల కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫ్రీ మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. అసోసియేషన్‌లో ఉన్న సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. డిసెంబర్‌లో మెడికవర్‌, మార్చిలో ఏఐజీ, జూన్‌లో అపోలో, సెప్టెంబర్‌లో కిమ్స్‌ ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కన్నా ఎక్కువ ఖర్చు అయితే, ఆ బిల్లులో రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ‘‘ప్రతి ఆస్పత్రిలో మా’ సభ్యుల కోసమే ఒక సహాయకుడిని ఏర్పాటు చేయనున్నాం. ఇక మహిళా సభ్యులు ఎవరైనా అనారోగ్యం పాలైతే వారి చికిత్స కోసం ప్రత్యేక ప్రయోజనాలు కల్పించనున్నారు. ముఖ్యంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌, సర్వికల్‌ క్యాన్సర్‌తో బాధపడే మహిళలకు అత్యుత్తమ చికిత్స అందించనున్నాం’’ అని ఆయన ఓ లేఖ ద్వారా తెలిపారు.,


‘మా’ సభ్యులకు ప్రత్యేకంగా చికిత్స అందించి, బిల్లులో రాయితీలను కల్పిస్తున్న వైద్యులు డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి(ఏఐజీ), డాక్టర్‌ భాస్కర్‌రావు(కిమ్స్‌), సంగీత(అపోలో), డాక్టర్‌ సుబ్రమణియం (సీఈవో అపోలో), డాక్టర్‌ గురవారెడ్డి (సన్‌షైన్‌), డాక్టర్‌ అనిల్‌ కృష్ణ(మెడికవర్‌)ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపామన్నారు. సభ్యుల ఆరోగ్య పరీక్షలకు అయ్యే ఖర్చులో 50శాతం రాయితీ ఇస్తామన్న టెనెట్‌ డయాగ్నస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ సురేశ్‌, చరణ్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మంచు విష్ణు. ఏఐజీ, అపోలో, కిమ్స్‌, మెడికవర్‌, సన్‌ షైన్‌ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషన్‌తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్‌ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. 




Updated Date - 2021-11-28T01:27:00+05:30 IST