విశ్వనటుడు కమల్‌హాసన్ నటించనున్న కొత్త చిత్రంలో నలుగురు విలన్లు నటించనున్నారనే వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్-2’, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ చిత్రంలో కమల్‌హాసన్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాల తర్వాత ‘పాపనాశం-2’ చిత్రంలో నటించనున్నారు. అలాగే, జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా కమల్‌హాసన్ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాల్లో ‘ఇండియన్-2’ చిత్రం వివాదంలో ఉంది.దీంతో విక్రమ్ చిత్రం ముందుగా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కావొచ్చన్నది కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం.
ఇదిలావుంటే, లోకేష్ కనకరాజ్ తెరకెక్కించే ‘విక్రమ్’ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ నటించనున్నట్టు ఇప్పటికే అధికారపూర్వకంగా ప్రకటించారు. అలాగే, ఇటీవల నటుడు నరేన్‌ను ఎంపిక చేశారు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు అంటే మొత్తం నలుగురు నటులు ఈ చిత్రంలో విలన్ పాత్రల్లో నలుగురు నటించనున్నట్టు తాజా సమాచారం. మరో ఇద్దరు విలన్లు ఎవరనేది అధికారికంగా తెలియలేదు కానీ.. విజయ్ సేతుపతి, అర్జున్ దాస్ పేర్లు మాత్రం కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ 'మాస్టర్' చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రాన్ని అంతా కోలీవుడ్ 'కెజియఫ్' అని పిలుస్తుండటం విశేషం.