నన్నెందుకు అలా చూపిస్తోందంటూ.. వికీపీడియాపై మాజీ మిస్ ఇండియా అసహనం

ABN , First Publish Date - 2022-01-18T20:23:18+05:30 IST

తనుశ్రీ దత్తా అంటే ఎవరో తెలియని వారుంటారేమో గానీ.. ‘ఆషిక్ బనాయా’ సాంగ్ బ్యూటీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు చాలామంది...

నన్నెందుకు అలా చూపిస్తోందంటూ.. వికీపీడియాపై మాజీ మిస్ ఇండియా అసహనం

తనుశ్రీ దత్తా అంటే ఎవరో తెలియని వారుంటారేమో గానీ.. ‘ఆషిక్ బనాయా’ సాంగ్ బ్యూటీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు చాలామంది. ఆ ఒక్క సాంగ్‌తో దేశవ్యాప్తంగా యువత గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది ఈ భామ. 


అయితే ఈ సాంగ్ కంటే ముందే 2004లో ఈ భామ మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది తనుశ్రీ. అంతేకాకుండా అనంతరం జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో సైతం పాల్గొంది. మొత్తం 133 దేశాల నుంచి అందగత్తెలు పాల్గొన్న ఈ కాంపిటీషన్‌లో టాప్ టెన్ జాబితాలో నిలిచింది. అయితే ఈ బ్యూటీ తాజాగా అందరి సమాచారాన్ని పొందుపరిచే వికీ పీడియాపై అసహనం వ్యక్తం చేసింది.


ఎందుకంటే.. వికీపీడియా తనుశ్రీ దత్తాని ‘ఇండియన్ మోడల్‌’గా మాత్రమే చూపిస్తోందని. దీనిపై సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ. అందులో.. ‘హలో ఫ్రెండ్స్.. కొంత కాలంగా నన్ను ఓ విషయం బాగా ఇబ్బంది పెడుతోంది. అదే నా వికీపీడియా ప్రొఫైల్. అందులో నన్నుకేవలం ‘ఇండియన్ మోడల్’గా మాత్రమే చూపిస్తోంది. అది తప్పు. అది నా పరపత్తిని తగ్గించడమే. నేను ఇది మార్చడానికి ప్రయత్నించాను. కానీ మళ్లీ అలాగే వస్తోంది.


నేను మిస్ ఇండియా యూనివర్స్.. బాలీవుడ్ నటిని. కానీ కేవలం‘ఇండియన్ మోడల్’ అని ఎందుకు రాశారో తెలియదు. సాధారణంగా ఏవరైనా సెలబ్రిటీల వర్క్  లేక అవార్డుల గురించే తెలుసుకోవడానికి ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేస్తారు. అయితే నా విషయంలో మాత్రం అది చూపించేది పరమ చెత్తగా ఉంది. కేవలం ఒక్క జీవితంలో ఇంత సాధించిన తర్వాత నా గురించి వికీపీడియాలో సరైన సమాచారం లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది.


బహుశా అందులోని రాతలు సరైనవి కావచ్చు. నా రివార్డులు, గుర్తింపు స్వర్గంలో ఉంటాయనుకుంటా. కానీ ఇలాంటి చెత్త విషయాల గురించి ఏ చేయాలో తెలియట్లేదు. ఎవరైనా సహాయం చేయగలిగితే దయచేసి చేయండి. 2022లో నాకు జీవితంలో గొప్ప, అద్భుతమైన విషయాలు జరుగుతాయని నేను భావిస్తున్నాన’ని రాసుకొచ్చింది.



Updated Date - 2022-01-18T20:23:18+05:30 IST