తొలిసారి లేడీ ఓరియెంటెడ్‌ కథలో...

ABN , First Publish Date - 2021-11-21T06:34:19+05:30 IST

‘ఉప్పెన’లా ఒక్కసారిగా విరుచుకుపడింది కృతిశెట్టి. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో అవకాశాలు వరుసకట్టాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న కథానాయికల్లో తన పేరు కూడా చేరిపోయింది...

తొలిసారి లేడీ ఓరియెంటెడ్‌ కథలో...

‘ఉప్పెన’లా ఒక్కసారిగా విరుచుకుపడింది కృతిశెట్టి. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో అవకాశాలు వరుసకట్టాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న కథానాయికల్లో తన పేరు కూడా చేరిపోయింది. ‘బంగార్రాజు’, ‘శ్యాం సింగరాయ్‌’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్న కృతి... ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్‌ కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాతగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. అదో నాయికా ప్రాధాన్యం ఉన్న కథ అని, ఆ సినిమా కోసం కృతిని ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు, ఇతర వివరాల్ని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశా లున్నాయి. 


Updated Date - 2021-11-21T06:34:19+05:30 IST