‘ఎమర్జెన్సీ’లో ఇందిర కోసం

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్‌ నటించనున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రారంభమైంది. ఇందిర పాత్ర కోసం కంగనా రనౌత్‌ సిద్ధమవుతున్నారు. బుధవారం బాడీ స్కానింగ్‌, ఫేస్‌ స్కానింగ్‌తో పాటు ప్రోస్థెటిక్‌ మేకప్‌ ప్రయత్నించారు. పర్‌ఫెక్ట్‌ లుక్‌ కోసం టెస్ట్‌లు చేశారు. ఆ సమయంలో తీసుకున్న వీడియో, ఫొటోలను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ‘‘మేడమ్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ ఇందిరా గాంధీ పాత్రలోకి ప్రవేశించే సమయం వచ్చింది. ‘ఎమర్జెన్సీ’ కోసం బాడీ స్కానింగ్‌ తీయించు కుంటున్నా. ప్రతి పాత్ర ఓ అందమైన ప్రయాణం ప్రారంభానికి నాంది. ఈ రోజు ‘ఎమర్జెన్సీ’ ప్రయాణం ప్రారంభించాం. నాకు ఈ సినిమా చాలా ప్రత్యేకం’’ అని కంగనా రనౌత్‌ పేర్కొన్నారు. ఇది ఇందిరా గాంధీ బయోపిక్‌ కాదు. ‘ఎమర్జెన్సీ అండ్‌ ఆపరేషన్‌ బ్లూస్టార్‌’ పుస్తకం ఆధారంగా రూపొందుతున్న పొలిటికల్‌ డ్రామా. ఈ చిత్రనిర్మాణంలో కంగనా రనౌత్‌ భాగస్వామి.


Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.