సర్కార్ వారి పాట : ఫ‌స్ట్‌ సింగిల్ ‘కళావతి’ పోస్టర్ విడుదల

ABN , First Publish Date - 2022-02-09T23:33:21+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిత్రాన్ని మే 12న విడుదల చేయబోతోన్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ పాటలకోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నారు. ఇందులో కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి. ఆ పాత్ర పేరు మీదుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. ఇది కచ్చితంగా మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది. తమన్ స్వరపరిచిన ఈ పాటతో అందరూ ప్రేమలో పడనున్నారు.

ఈ పాట మహేష్ బాబు, కీర్తి సురేష్ మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీని చూపుతుంది. ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. పోస్టర్‌లో మహేష్ బాబు  ట్రెండీ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. కీర్తి సురేష్ చీరలో మెరిసిపోతూ మతిపోగొడుతోంది. ఇదివరకెన్నడూ చూడని స్టైలిష్ అవతార్ లో మహేష్ బాబుని ప్రెజెంట్ చేస్తున్నాడు దర్శకుడు పరశురామ్. మైత్రీ మూవీ మేకర్స్, జీయమ్బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

Updated Date - 2022-02-09T23:33:21+05:30 IST