విక్రమ్ వేద నుంచి హృతిక్ లుక్ ఔట్..

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్  జనవరి 10న 48వ పుట్టిన పుట్టిరోజు జరుపుకొంటున్నారు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘‘ విక్రమ్ వేద’’. తమిళ హిట్ చిత్రం ‘‘ విక్రమ్ వేద’’ ను హిందీలో అదే పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. తమిళ్ వెర్షన్‌కు పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించారు. హిందీ వెర్షన్‌కు కూడా వారే దర్శకత్వం వహిస్తున్నారు. హృతిక్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం సినిమాలో అతడి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఆ పస్ట్ లుక్‌కు నెటిజన్లు అందరు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 


 సినిమాలో హృతిక్ లుక్‌ను పుష్కర్ గాయత్రి  తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో అభిమానులతో పంచుకున్నారు. ‘‘ హృతిక్ రోషన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. అతడితో పనిచేయడం సంతోషంగా ఉంది.  వచ్చే ఏడాది మరింత అద్భుతంగా ఉంటుంది. సినిమాలోని వేద ఫస్ట్ లుక్ చూడండి. థియేటర్లల్లో ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలవుతుంది ’’ అని పుష్కర్ గాయత్రి ట్వీట్ చేశారు. గత ఏడాది అక్టోబర్ 15న ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో హృతిక్‌తో పాటు రాధికా ఆప్టే, సైఫ్ అలీఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.