రామ్ గోపాల్ వర్మ వదిలిన ‘ఒక పథకం ప్రకారం’ ఫస్ట్ లుక్‌

ABN , First Publish Date - 2022-01-26T17:56:23+05:30 IST

రామ్ గోపాల్ వర్మ తాజాగా ‘ఒక పథకం ప్రకారం’ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా ఇది. వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ వదిలిన ‘ఒక పథకం ప్రకారం’ ఫస్ట్ లుక్‌

రామ్ గోపాల్ వర్మ తాజాగా ‘ఒక పథకం ప్రకారం’ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా ఇది. వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్. తాజాగా ఈ చిత్ర పోస్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది. 


దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమా కాన్సెప్టును పోస్టర్‌లోనే చూపించారు మేకర్స్. సాయిరామ్ శంకర్ తాజా పోస్టర్‌లో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ‘ఒక పథకం ప్రకారం’ మూవీ వస్తుంది. ఈ చిత్రం దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ఈ సినిమాకు పని చేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని విశేషాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.  

Updated Date - 2022-01-26T17:56:23+05:30 IST