నన్ను భరించడం కష్టం
ABN , First Publish Date - 2021-12-05T10:27:49+05:30 IST
తొలి సినిమా ‘రొమాంటిక్’తో ఆకట్టుకుంది కేతిక శర్మ. ఇప్పుడు రెండో సినిమా కూడా పూర్తి చేసింది. నాగశౌర్య నటించిన ‘లక్ష్య’లో తనే కథానాయిక. సంతోష్ జాగర్లమూడి దర్శకుడు...

తొలి సినిమా ‘రొమాంటిక్’తో ఆకట్టుకుంది కేతిక శర్మ. ఇప్పుడు రెండో సినిమా కూడా పూర్తి చేసింది. నాగశౌర్య నటించిన ‘లక్ష్య’లో తనే కథానాయిక. సంతోష్ జాగర్లమూడి దర్శకుడు. ఈనెల 10న విడుదల అవుతోంది. ఈసందర్భంగా కేతిక మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నా పేరు రితిక. మనసుకి ఏమనిపిస్తే అది చేస్తుంది. తొలి సినిమా ‘రొమాంటిక్’తో పోలిస్తే... చాలా విభిన్నమైన పాత్ర. ‘రొమాంటిక్’ విడుదలైన నెలరోజులలోపే ‘లక్ష్య’ కూడా ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమా. నాకు కూడా క్రీడలంటే చాలా ఆసక్తి. స్టేల్ లెవల్ స్విమ్మర్‌ని. మా అమ్మగారు కూడా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథలంటే నాకు ఇష్టం. భవిష్యత్తులో స్పోర్ట్స్ డ్రామా వస్తే తప్పకుండా నటిస్తా. ఈ సినిమాలో నేను పోషించిన పాత్రకూ.. నా నిజ జీవితానికీ దగ్గర పోలికలు ఉంటాయి. రితిక లా నేను కూడా ముక్కుసూటిగా మాట్లాడతా. నన్ను భరించడం చాలా కష్టం. ప్రస్తుతం వైష్ణవ్‌తేజ్‌తో ఓసినిమా చేస్తున్నా. కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమకథ అది. నా పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంద’’ని చెప్పుకొచ్చింది.