Tollywood: తినుబండారాలు, టికెట్ ధరలు.. మల్టీప్లెక్స్‌లలోనూ ప్రక్షాళన!

Twitter IconWatsapp IconFacebook Icon
Tollywood: తినుబండారాలు, టికెట్ ధరలు.. మల్టీప్లెక్స్‌లలోనూ ప్రక్షాళన!

తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood)లో ప్రక్షాళన మొదలైంది. థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోవడంతో.. నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. పాండమిక్ తర్వాత ఒకటి, రెండు సినిమాలు మినహా.. విడుదలైన అన్ని సినిమాలు నిర్మాతలకు నష్టాలనే మిగిల్చాయి. దీంతో.. సినిమా ప్రారంభం నుండి విడుదల వరకు పాత్ర వహించే అన్ని విభాగాలలోనూ నిర్మాతలు రిపేర్లు మొదలెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని విభాగాలతో చర్చలు జరిపిన ఫిల్మ్ చాంబర్ (Film Chamber) పెద్దలు.. గురువారం మల్టీప్లెక్స్ థియేటర్ల జాతీయస్థాయి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టికెట్ ధరలు, తినుబండారాల ధరలు, వసతులపై ఫిల్మ్ చాంబర్ పెద్దలు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశం ఆశాజనకంగా సాగినట్లుగా సమాచారం. 


ఈ సమావేశంలో.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మల్టీప్లెక్స్ థియేటర్ల (multiplex theaters)లో తినుబండారాల ధరలు తగ్గించాలని.. ధరలు, క్వాంటిటీ తగ్గించి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచాలని మల్టీప్లెక్స్ ప్రతినిధులను ఫిల్మ్ చాంబర్ పెద్దలు కోరగా... ఫిల్మ్ చాంబర్ సూచనలను పరిగణనలోకి తీసుకొని తినుబండారాల ధరలు తగ్గిస్తామని మల్టీప్లెక్స్ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే  నిర్మాతలు నిర్ణయించిన టికెట్ ధరలనే మల్టీప్లెక్స్ థియేటర్లలో అమలు చేస్తామని కూడా వారు తెలిపినట్లుగా సమాచారం అందుతోంది.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.