అనుపమాను అలా చూడకండి – క్రితి కాదు.. చబ్బీ సనన్‌

ABN , First Publish Date - 2021-07-19T02:22:28+05:30 IST

సినీ తారలు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సండే సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలు షేర్‌ చేసి అభిమానులను అలరించారు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

అనుపమాను అలా చూడకండి – క్రితి కాదు.. చబ్బీ సనన్‌

సినీ తారల సండే సందడి

సినీ తారలు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సండే సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలు షేర్‌ చేసి అభిమానులను అలరించారు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి! 


1. రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన, మహేశ్‌ సతీమణి నమ్రత శిరోద్కర్‌, శ్రీజ తమ ేస్నహితులతో కలిసి సందడి చేశారు. ఈ గ్రూప్‌ ఫొటోని షేర్‌ చేశారు. 


2. నా కళ్లలోకి అలా చూడడం మానేయండి అంటోంది అనుపమా పరమేశ్వరన్‌. 


3. సమంత ఓ అందమైన ఫొటోను పంచుకున్నారు. 


4. తాప్సీ నటిస్తూ, నిర్మిస్తున్న ‘బ్లర్‌’ చిత్రం షూటింగ్‌ ఆదివారం మొదలైంది. ఫస్ట్‌ డే షూట్‌ అంటూ ఈ విషయాన్ని ఆమె పంచుకున్నారు. 


5. తన తాజా చిత్రం షూటింగ్‌ కోసం ముంబైకి పయనమయ్యారు మాధవన్‌. సెట్‌లో దిగిన ఫొటోని షేర్‌ చేసి ‘మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. 


6. నా జుట్టుకి ఏమైందీ అంటున్నారు వరుణ్‌తేజ. స్టైలిష్‌ హెయిర్‌ స్టైల్‌ ఫొటోను ఆయన షేర్‌ చేశారు. 


7. ప్యారిస్‌లో నాకు నచ్చిన బ్రిడ్జి అంటూ అక్కడ తీసుకున్న ఫొటోని షేర్‌ చేసింది బాలీవుడ్‌ నటి మల్లికా షెరావత్‌. 


8. రామేశ్వరాన్ని చాలా మిస్‌ అవుతున్నాని తెలిపింది నాయిక కీర్తి సురేశ్‌. గతంలో అక్కడ దిగిన ఫొటోను పంచుకున్నారు. 


9. ‘మిమీ’ చిత్రంలోని సరోగసీ మదర్‌ పాత్ర కోసం బొద్దుగా మారింది కృతి సనన్‌. దానికి సంబంధించిన ఫొటోని చూపిస్తూ ‘నన్ను నేను గుర్తుపట్టలేదు’ అని అంటోంది. ఇది క్రితి సనన్‌ కాదు చబ్బీసనన్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. 


10. ‘రెడ్‌ అలర్ట్‌ రాబోయే తుపాను గురించి వివరాలను తెలుసుకునేందుకు వేచి చూడండి అంటున్నారు హీరో సునీల్‌. తన కొత్త సినిమా వివరాలను అప్పుడే పంచుకోనన్నారు. 



































































Updated Date - 2021-07-19T02:22:28+05:30 IST