Social talk: ప్రేమలో పడకండి... ప్రేమలో ఎదగండి!

ABN , First Publish Date - 2022-02-15T22:04:16+05:30 IST

తెరపై ప్రేమికులుగా కనిపించిన చాలామంది నిజజీవితంలోనూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. కొందరైతే ప్రేమబంధం నుంచి ప్రమోట్‌ అయ్యి వివాహ బంధంతో ఒకటయ్యారు. గత ఏడాది ప్రేమికులుగా వాలంటైన్స్‌ డే సెలబ్రేట్‌ చేసుకున్న కొందరు ఈసారి భార్యభర్తల బంధంతో సెలబ్రేట్‌ చేసుకున్నారు. మరికొందరూ ఇంకా ప్రేమలో మునిగి తేలుతున్నారు.

Social talk: ప్రేమలో పడకండి... ప్రేమలో ఎదగండి!

తెరపై ప్రేమికులుగా కనిపించిన చాలామంది నిజజీవితంలోనూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. కొందరైతే ప్రేమబంధం నుంచి ప్రమోట్‌ అయ్యి వివాహ బంధంతో ఒకటయ్యారు. గత ఏడాది ప్రేమికులుగా వాలంటైన్స్‌ డే సెలబ్రేట్‌ చేసుకున్న కొందరు ఈసారి భార్యభర్తల బంధంతో సెలబ్రేట్‌ చేసుకున్నారు. మరికొందరూ ఇంకా ప్రేమలో మునిగి తేలుతున్నారు. సోమవారం వాలంటైన్స్‌ డే సందర్భంగా కొందరు ప్రేమ ఫొటోలు పంచుకున్నారు. ఈ సందడి మీకోసం 


1. తన భర్త కిచ్లూకి వాలంటైన్స్‌ డే శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫొటోను షేర్‌ చేశారు కాజల్‌. 2012 నుంచి ఈ అనుబంధం  కొనసాగుతుంది అని పేర్కొంది. 


2. ఇటీవల వివాహ బంధంతో ఒకటైన కట్రీనా – విక్కీ కౌషల్‌ దంపతులు ప్రేమికుల రోజును సెలబ్రేట్‌ చేసుకున్నారు. ‘‘ఈ ఏడాది మనం రొమాంటిక్‌ డిన్నర్‌ చేయలేకపోవచ్చు. కానీ క్లిష్‌ట పరిస్థితులను సరిచేయడానికి నువ్వు నా వెంట ఉన్నావ్‌ అదే ముఖ్యం’’ అని కట్రీనా రాసుకొచ్చారు. 


3. నయనతార తన ప్రియుడికి ఎదురొచ్చి మరీ పుష్పగుచ్చంతో ఇచ్చి కౌగిలితో శుభాకాంక్షలు చెప్పారు. 


4. ‘‘చేతిలో చేయి వేసుకుని.. ముందు వెనుక కాకుండా జీవితాంతం పక్కనే ఉంటూ ఈ వేడుక సెలబ్రేట్‌ చేసుకుందాం’’ అంటూ ఆకాంక్షసింగ్‌ తన భర్త కునాల్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. 


5. ప్రేమలో పడకండి... ప్రేమలో ఎదగండి అంటూ కొటేషన్‌ ఇచ్చారు స్నేహ. తన భర్తతో ఆప్యాయంగా దిగిన ఫొటోను పంచుకున్నారు. 


6. మలైకా అరోరాతో ప్రేమలో ఉన్న అర్జున్‌ కపూర్‌ ఆమెతోకలిసి వాలంటైన్స్‌డే సెలబ్రేట్‌ చేసుకున్నారు. నువ్వు నావాడివి అంటూ పోస్ట్‌ చేశారు. 


7. కృతి కర్భంద తన ప్రియుడిని ముద్దాడుతున్న ఫొటోను పంచుకున్నారు. అయితే ఆ ఫొటోను నీడను మాత్రమే పోస్ట్‌ చేసి ఎవరో కనుక్కోండి’’ అని ఛాలెంజ్‌ విసిరారు. 


ఇంకా సింగిల్‌గా ఉన్న చాలామదిఇ తారలు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపారు. 






























Updated Date - 2022-02-15T22:04:16+05:30 IST